Breaking News

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించేందుకు కృషి:ఆర్ధికమంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను సాధ్యమైనంత వరకూ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందుని రాష్ట్ర ఆర్ధిక, వాణిజ్య మరియు శాసన సభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.బుధవారం ఎపి సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై సుమారు 5గం.ల పాటు ఉద్యోగుల సమస్యలను తెల్సుకుంది. సమావేశ అనంతరం ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ 21 ఉద్యోగ సంఘాల నుండి అన్ని సమస్యలను తెలుసుకున్నామని వాటన్నిటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకూ ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా వేతన సవరణ కమీషన్ ను ఏర్పాటు,ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏలు,ఇతర పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించాలనే డిమాండ్లు అన్ని ఉద్యోగ సంఘాల నుండి వచ్చాయని వాటన్నిటినీ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకువెళ్ళి సానుకూలంగా పరిష్కారం అయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఉద్యోగులు వేరు ప్రజా ప్రతినిధులు వేరు కాదని ఇరువురు కలిసి పని చేస్తేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి పధంలో ముందుకు వెళుతుందని అన్నారు.ఉద్యోగులపై చేసే ఖర్చును ప్రభుత్వం భారంగా పరిగణించడం లేదని పెట్టుబడిగానే భావించడం జరుగుతోందని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధృక్పదంతోనే కంట్రిబ్యూటరీ ఫెన్సన్ స్కీమ్ నుండి ఓల్డ్ ఫెన్సన్ స్కీమ్ కు మార్చిందని అన్నారు.అదే విధంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా 60 నుండి 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సును పెంచిందని చెప్పారు.
గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పెద్దఎత్తున వచ్చిన అప్పుల భారం నుండి రాష్ట్రాన్ని ఏవిధంగా బయటకు తేవాలనే దానిపై ముఖ్యమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారని ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయం అందిస్తోందని ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి వచ్చాయంటేనే ఈప్రభుత్వ వచ్చాక రాష్ట్రం ఆర్ధికంగా ఏవిధంగా ముందుకు వెళుతుందో అర్ధం అవుతోందని ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఈసమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకూ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.వివిధ ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించి ప్రభుత్వ స్థాయిలో వీలైనంత మేరకు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర సర్వీసెస్ మరియు హెచ్ఆర్ఎం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ముందుగా సమావేశానికి స్వాగతం పలికి ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను వివరించిన పిదప ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుండి పెండింగ్ అంశాలు, సమస్యలను అడిగి తెల్సుకున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్,రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖా మాత్యులు అనగాని సత్యప్రసాద్ లు పాల్గొనగా,రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు,వినియోగ దారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ వర్చువల్ గా పొల్గొన్నారు.ఇంకా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు శశి భూషణ్ కుమార్,యంటి.కృష్ణబాబు,ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్,కార్యదర్శులు వాడ్రేవు వినయ్ చంద్,వీరపాండ్యన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అదే విధంగా ఉద్యోగ సంఘాల తరపున ఎపి ఎన్జిజిఓ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి.రామకృష్ణ,ఎపి రెవెన్యూ సర్వీసెస్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు,ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్యనారాయణ,ఎస్టియు ఎపి అధ్యక్షులు సాయి శ్రీనివాస్,ఎపి యుటిఎఫ్ ఎన్. వెంకటేశ్వర్లు,ఎపి పిఆర్టియు ఎం.కృష్ణయ్య,ఎపిటిఎఫ్ జి.హృదయరాజు,ఎపి ఉపాధ్యాయ సంఘం ఎస్.బాలాజి,ఎపి పిటిడి ఎంప్లొయిస్ యూనియన్ పి.దామోదర రావు,ఎపి టైపిస్ట్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ గోపాల కృష్ణ,ఎపి గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్ ఎస్.శ్రీనివాసరావు,ఆల్ ఆంధ్రా క్లాస్ 4 సెంట్రల్ అసోసియేషన్ ఎన్.చంద్ర శేఖర్,ఆల్ ఆంధ్రా క్లాస్ 4 సెంట్రల్ అసోసియేషన్ ఎస్.మల్లేశ్వరరావు,ఎపి పిటిడి యూనియన్ మజ్దూర్ యూనియన్ వై.శ్రీనివాసరావు,ఎపి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అసోసియేషన్ కె.చందచరశేఖర్,ఎపి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం వేణు మాధవ రావు,ఎపి జూనియర్ వెటర్నరి లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ బి.సేవా నాయక్,ఎపి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మనోహర్ రావు,ఎపి స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ప్రత్యేక ఆహ్వానితులు) పిఎస్ఎస్ఎన్ శాస్త్రి,ఎపి స్టేట్ గవర్నమెంట్ ఫెన్సనర్స్ అసోసియేషన్(ప్రత్యేక ఆహ్వానితులు)జి.మనోహర్ దాస్ వారి వారి సంఘాల తరుపున వివిధ సమస్యలు,డిమాండ్లను మంత్రుల బృందం దృష్టికి తీసుకువచ్చారు.ఇంకా ఆయా ఉద్యోగ సంఘాల జనరల్ సెక్రెటరీలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *