Breaking News

డ్వాక్రా మ‌హిళ‌లను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దేందుకు సాయం చేయండి

– సెక్టార్ బేస్డ్ మరియు ఆర్టిసాన్ క్ల‌స్ట‌ర్ల‌కు త్వ‌రగా ఆమోదం తెల‌పండి
– కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌కు మంత్రి కొండ‌ప‌ల్లి విజ్ఞ‌ప్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వ‌యం స‌హాయాక సంఘాల‌ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రతిపాదించిన సెక్టోరియ‌ల్ & ఆర్టిసాన్ క్ల‌స్ట‌ర్ల ఏర్పాటు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బుధ‌వారం ఉద‌యం మంత్రి ఢిల్లీలోని భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె. అనిల్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా DAY-NRLM కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జక్కంపూడి లఖ్‌పతి దీదీ పార్క్ (750 మంది లబ్ధిదారులు), పొండూరు ఖాదీ క్లస్టర్, గుంటూరు పికిల్స్ & చిల్లీ బై-ప్రొడక్ట్స్ క్లస్టర్, చీరాల హ్యాండ్‌లూమ్ క్లస్టర్, ఎమ్మిగనూరు హ్యాండ్‌లూమ్ క్లస్టర్, మిల్లెట్ క్లస్టర్ వంటి సెక్టార్ ఆధారిత మరియు ఆర్టిసాన్ క్ల‌స్ట‌ర్ల ప్రాజెక్టులకు త్వర‌గా అనుమతులు మంజూరు చేయాలని మంత్రి గారు కోరారు.

ఈ సెక్టార్ ఆధారిత మరియు ఆర్టిసాన్ క్ల‌స్ట‌ర్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెట్ అనుసంధానం, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” కార్యక్రమానికి మరింత ఊతం లభిస్తుందని మంత్రి తెలిపారు. అలాగే సెర్ప్‌ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు రూపొందించిన “స్వయం (SWAYAM)” బ్రాండ్‌కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని, మార్కెటింగ్, బ్రాండింగ్, మార్కెట్ లింకేజీల పరంగా DAY-NRLM ద్వారా అవసరమైన మద్దతు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

డ్వాక్రా మహిళలకు స్ట్రీ నిధి ద్వారా అందజేస్తున్న రుణాలకు కూడా DAY-NRLM వడ్డీ రాయితీ (Interest Subvention) పథకాన్ని విస్తరించాలని మంత్రి కోర‌డంతో పాటు దీనివల్ల మహిళలపై రుణభారం తగ్గడంతో పాటు చిన్న‌ వ్యాపారాల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. మంత్రి విజ్ఞ‌ప్తిపై స్పందించిన గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి టి.కె. అనిల్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మహిళా సాధికారత, జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు. ప్రతిపాదిత సెక్టార్ ఆధారిత మరియు ఆర్టిసాన్ క్లస్టర్లను త్వర‌గా ఆమోదించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. “స్వయం” బ్రాండ్ మార్కెటింగ్ కార్యక్రమానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే స్త్రీ నిధి రుణాలకు DAY-NRLM వడ్డీ రాయితీ పథకాన్ని విస్తరించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *