Breaking News

రంపచోడవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

-మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం
-‘తల్లికి వందనం’ లబ్ధిదారులతో ముచ్చటించనున్న చంద్రబాబు
-ప్రభుత్వ బడిలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్న ముఖ్యమంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. రంపచోడవరంలోని ప్రభుత్వ హైస్కూల్ – జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించే మెగా పేరేంట్ – టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. విద్యార్థులతో కలిసి ఇరువురు నేతలు విద్యార్థులు-తల్లిదండ్రులు-ఉపాధ్యాయులతో సమావేశం అవుతారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల విద్యా ప్రగతిని సమీక్షించి, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2024లో ప్రభుత్వం ఏర్పడ్డాక శుక్రవారం నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం నాలుగోది.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 9:10 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10:00 గంటలకు పోలవరం జిల్లా రంపచోడవరానికి చేరుకుంటారు. 10:20 గంటలకు ప్రభుత్వ హైస్కూల్ & జూనియర్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు. 10:20 మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో పాల్గొంటారు. 11:35 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:20 నుంచి గంటలకు మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 02:30 గంటలకు ఐ.పోలవరంలో టీడీపీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:25 గంటలకు రంపచోడవరం పర్యటన ముగించుకుని 5:15 గంటలకు క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *