విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 10.00 గంటల నాటికి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,718 మంది (93.48 శాతం) ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు.
డిజిటలైజ్ చేసిన వివరాల్లో 2,43,415 మంది ఓటర్లను 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేయగా, 16,303 మంది ఓటర్లను “నో మ్యాపింగ్” కింద నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే 18,104 మంది ఓటర్లు అన్‌కలెక్టబుల్ (గైర్హాజరు, నివాసం మారిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ తదితర కారణాలు) విభాగంలో ఉన్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో ఏఈఆర్వోలు కే సంజయ్ రత్నకుమార్, కె. ప్రభుదాస్, పి సత్య కుమారి, కె. లక్ష్మి, ఎస్‌డీటీ (EPIC) ఎస్. సురేష్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్సారి (ఐఎన్‌సీ), ఎన్. వీరభద్రరావు (సీపీఐ), బి. రమణారావు (సీపీఎం), ఎన్. సాంబశివరావు (టీడీపీ), జి. సుందర్ పాల్ (వైఎస్సార్‌సీపీ) పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News