Breaking News

SC, ST, BC కార్పొరేషన్ కు పథకాలు ఏవీ, నిధులు ఏవీ…

-విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసిన దళిత బహుజన నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగ బద్దంగా గత 50 ఏళ్లలో ప్రభుత్వాలు SC, ST, BC కార్పొరేషన్ ల ద్వారా ఆయావర్గాలకు అనేక అభివృద్ధి పథకాలు అమలు జరుపుతూ వచ్చాయని, గత జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ లను నిర్వీర్యం చేసి, పథకాలు అమలు చేయకాదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా జగన్ రెడ్డి బాటలోనే నడుస్తూ కుల కార్పొరేషన్ లకు గడిచిన రెండేళ్ల పాలనలో నిధులు, పథకాలు లేకుండా మోసం చేస్తున్నారని SC, ST, BC, JAC నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో JAC ఆధ్వర్యంలో కన్వీనర్ కొరివి వినయ కుమార్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల, సంఘాల నేతలు పాల్గొని ప్రసంగించారు. CPI పార్టీ రాష్ట్ర కార్యదర్శి G. ఈశ్వరయ్య సమావేశంలో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం, నేటి కూటమి ప్రభుత్వం కూడా కుల కార్పొరేషన్ లకు ఆర్భాటంగా చైర్మన్ లు, డైరెక్టర్ లను మాత్రమే నీయమీ0చి, పథకాలు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. SC, ST, BC ల హక్కుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం దారిలోనే కూటమి ప్రభుత్వం నడవటం శోచనీయమని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం తమ ఎన్నికలహామేలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఆయా వర్గాల హక్కుల పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు అణగారిన వర్గాల నాయకులు సమైక్యం కావాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కన్వీనర్ కొరివి వినయ కుమార్ మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం రద్దు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 8 వేల మంది SC పారిశ్రామిక వేత్తల కు చెల్లించాల్సిన 7 వందల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. SC ST సబ్ ప్లాన్ చట్టానికి కాలపరిమితి లేకుండా SC, ST, BC సమగ్రాభివృద్ధి చట్టంగా మార్చాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటి చైర్మన్ అంగడాల పూర్ణ చంద్ర రావు, విదసం రాష్ట్ర కన్వీనర్ డా.బూసి వెంకట రావు, దళిత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వంగిపురపు రెడ్డన్న, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర, KVPS రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, DHPS రాష్ట్ర కార్యదర్శి కరువది సుబ్బారావు, AP MRPS రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వర రావు, AP. BC మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉగ్గం సాంబ శివరావు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ, దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. చిట్టి బాబు, మేలుకో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఫాదర్ థామస్ పల్లి .దానం సోషల్ జస్టిస్ ఫోరమ్ కార్యదర్శి గద్దల ఆదా0, IFTU రాష్ట్ర కార్యదర్శి M. రామ కృష్ణ, తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *