Breaking News

అగ్ని మాపక శాఖలో ప్రమోషన్ల పోరులో కులం కార్డు తగదు…

-అవినాష్ జయసింహ అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలి- హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, ప్రదీప్ డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిబంధనల ప్రకారం పదవిలో ఉన్న సాటి కులస్తుడిపై దళితకులమనే గుర్తింపును దుర్వినియోగం చేస్తూ అసత్య ఆరోపణలు చేసిన ఫైర్ డిపార్ట్మెంట్ డీఎఫ్ఓ అధికారి అవినాష్ జైసింహపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాదులు మన్నం రాజశేఖర్, చార్లెస్ ప్రదీప్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో న్యాయవాదులు మాట్లాడుతూ తన కక్షిదారుడు అయిన డీఎఫ్ఓ చిక్కాల రత్నబాబుకి రోస్టర్ 27 ప్రకారం సీనియర్ సబార్డినేట్ రూల్స్ 12 బి కింద ఫైర్ రీజినల్ ఆఫీసర్ గా కొనసాగటానికి రూల్స్ అంగీకరిస్తున్నాయని స్పష్టం చేసారు. చిక్కాల రత్నబాబు కూడా ఎస్సీ మాల సామాజిక వర్గమేనని, ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ 2026 వ్యాజ్యం కూడా దాఖలు చేసామని వివరించారు. ప్రమోషన్ రానివ్వకుండా తనకు అడ్డం పడుతున్నాడనీ రత్నబాబుపై సాటి మాల కులస్తుడైన అవినాష్ జయసింహ నిరాధార ఆరోపణలపై తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నామని తెలిపారు. వివాదం కోర్టు పరిధిలో ఉండగా వ్యాఖ్యలు చేయడం పట్ల కోర్టు ధిక్కరణ కింద కేసు ఫైల్ చేస్తున్నామన్నారు. అలాగే జయసింహ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమోషన్ వ్యవహారంపై తాము హైకోర్టును ఆశ్రయించగా డీపీసీ కమిటీ ఏర్పాటు అయిందని, వివాదం సదరు కమిటీ ముందు పెండింగ్ లో ఉందని పదోన్నతి కి సంబంధించి కమిటీదే తుది నిర్ణయం అని అన్నారు. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఈ విషయంపై ఏమాత్రం సంబంధం లేని అగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ వెంకట రమణపై నిరాధార ఆరోపణలు చేసిన జయసింహ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. ప్రభుత్వానికి, ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. మా క్లైంట్ కి రావాల్సిన ప్రమోషన్‌ని రానివ్వకుండా కావాలని దళిత కార్డుతో ఎవరైతే డీజీని బెదిరిస్తా ఉన్నారో ఇది కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తుందని చార్లెస్ ప్రదీప్ అన్నారు. దళిత కార్డు వాడే కొంతమంది మాల మహానాడు నాయకులు నిజాలు తెలుసుకోవాలని, జయసింహ ఆరోపణలు పూర్తిగా అసత్యమనీ ప్రదీప్ వాఖ్యానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *