Breaking News

బీసీల గొంతుక ఈనెల 28న చలో ఢిల్లీ కార్యక్రమాన్నీ విజయవంతం చేద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా బీసీ కులాల సామాజిక ఆర్థిక, కుల గణనను తక్షణమే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ ఇంచార్జి నూకాలమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ఒక ప్రముఖ హో టల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నుకాలమ్మ మాట్లాడుతూ బీసీలపై జరుగు తున్న వివక్షను అరిక ట్టేందుకు ఎస్సీ, ఎస్టీ తరహాలోనే ప్రత్యేకంగా బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లపై ఒత్తిడి తీసుకువ చ్చేందుకు ఈ నెల 28వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరస న కార్యక్రమాన్ని నిర్వ హించనున్నట్లు ఆమె వెల్లడించారు. బీసీల్లోని అన్ని ఉప కులాలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆ దిశగా పాలకులు తగిన చర్యలు తీసుకోవాలని నూకాలమ్మ ఈసంద ర్భంగా స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఇన్చార్జిగా పిల్ల శ్రీనివాసరావును నియమించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నూతన ఇంచార్జిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ బిసిల సంక్షేమ సంఘంల ఇంచార్జిగా నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఎటువంటి వివక్షత చూపనని, నా దగ్గరకు వచ్చిన ఏ పనినైనా సమర్ధవంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు భాస్కర్ శ్రీనివాస్, కనిశెట్టి లక్ష్మణ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *