విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వాసవ్య మహిళా మండలి అపొలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆటోనగర్ సన్ లైట్ సెంటర్ వద్ద శనివారం ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీమతి జి. రశ్మి కార్యదర్శి వాసవ్య మహిళా మండలి మాట్లాడుతూ వరల్డ్ సైట్ డే సందర్భంగా ఈ నెల 8వ తారీకు నుండి 23 వరకు ఆటోనగర్ మరియు పరిసర ప్రాంతాలలో కంటి సంరక్షణ కొరకు అవగాహనా సిభిరాలతో పాటు గా ఉచిత మెగా వైధ్యశిభిరాలను నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఈ రోజు వైద్యసిభిరానికి 91 మంది హాజరు అవగా అందులో దృష్టిలోపం ఉన్న 56 ఆటోనగర్ కార్మికులకు రోటరి క్లబ్ ఆఫ్ విజయవాడ వారు ఉచితంగా కళ్లజోడులను అందివ్వడం జరిగిందని ఆమె అన్నారు.
అనంతరం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్ష్యులు యస్.రవి ప్రకాష్ మాట్లాడుతూ హెల్త్ క్యాంపుల ద్వారా కార్మికులు తమ అనారోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు పరీక్షించుకొని తద్వారా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉందని కావున కార్మికులు అందరూ ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని ఆయన అన్నారు. రాబోయే రోజులలో రోటరి క్లబ్ ఆఫ్ విజయవాడ వారు వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ వారితో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాల రూపకల్పన చేస్తుందని ఆయన హామి ఇచ్చారు.
అనంతరం ది ఆటోమొబైల్ టెక్నిషియన్స్ అసోసియేషన్ అధ్యక్ష్యులు రాజనాల బాబ్జీ మాట్లాడుతూ ఆటోనగర్ కార్మికుల ఆరోగ్యరక్షణ కై పనిచేస్తున్న సంస్థల అందరికి కృతజ్ఞతలని ఆయన అన్నారు. ఈ సిభిరంలో సాధారణ అనారోగ్య సమస్యలకు మందులతో పాటుగా షుగర్, బి.పి లను ఎలా అదుపులో ఉంచుకోవాలో సిబ్బంది తమ కౌన్సిలింగ్ లో సేవలను అందిస్తున్నారని అంతేకాకుండా ఉచితంగా కళ్లజోడును అందింవ్వడం అభినందనీయం అని ఆయన అన్నారు కావున ఆటోనగర్ కార్మికులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ కార్యదర్శి రామకృష్ణ ఉప్పలపాటి, రొటేరియన్స్ వై. కృష్ణ మోహన్, పృద్వి, ది ఆటోమొబైల్ టెక్నిషియన్ అసోసియేషన్స్ ఉపాదక్ష్యులు రావి రామ చంద్రరావు, కార్యదర్శి ఆర సత్యనారాయణ, వాసవ్య మహిళా మండలి సిబ్బంది డాక్టర్ ఆర్ స్వర్ణలత, కె.శ్రీనివాసరావు, యస్.ఆనందరావు, డి.నాగరాజు, పి.సుదర్శన్, ఎ.సత్యప్రసాద్, డి. వీరాంజనేయులు, యమ్ సాత్విక్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News