విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్ ఓ సీ లను మంజూరు చేయిస్తున్నారు. భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ వించి పేటకు చెందిన మాడుగుల విష్ణు చైతన్య మెరుగైన వైద్యం కోసం 7.27 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న చైతన్యకు త్వరితగతిన ఎల్ ఓ సీ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News