Breaking News

ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందుకు పోలీస్, రెవెన్యూ, జోనల్, పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్ తెలిపారు. నగర కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు మంగళవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే ఎన్నికల నిర్వహణలోకి విధులు కేటాయించబడిన వారు ఉండాలన్నారు. ఎన్నికల్లో ప్రతి విధి ఎంతో కీలకమని, సదా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తొలుత జోనల్ అధికారుల వారీగా పోలింగ్ కేంద్రాలపై సమగ్ర అవగాహనకు రావాలని, వాటిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక కెంద్రాలను గుర్తించి, వాటిలో గతంలో జరిగిన ఎన్నికల సరళి వివరాలు తీసుకోవాలని సూచించారు. అలాగే పోలీస్ అధికారులు కూడా పోలింగ్ కేంద్రాల్లో తీసుకోవాల్సిన బందోబస్త్ పై పర్యవేక్షణ చేయాలన్నారు. జోనల్ అధికారులు తమ పరిధిలోని కేంద్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు ఎదురైనా లేదా గుర్తించినా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సి.హెచ్ శ్రీనివాస్, డిసిపి సూరజ్ కుమార్, జోనల్ అధికారులు, వివిధ పోలీస్ స్టేషన్ ల ఎస్హెచ్ఓలు, టిపిబిఓలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …