సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త:
సీతానగరంలోని రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో మంగళవారం శ్రీధనలక్ష్మి అమ్మవారికి విశేష అభిషేకం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, అమ్మవారి పల్లకిసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కృపాకటాక్షాలు సర్వజనులపై ఉండాలని ప్రార్థించారు.
Prajavartha Online Telugu News