-హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికిన ఎవరెస్టు స్పాన్సర్ అన్విత గ్రూప్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోని అన్ని ఖండాలలో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించటమే తన ముందున్న ప్రధాన ద్యేయమని పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి అన్నారు. ఎవరెస్టు పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించిన తదుపరి హైదరాబాద్ చేరుకున్న అమెను స్పాన్సర్స్ గా వ్యవహరించిన అన్వితా గ్రూపు అధినేత బొప్పన అచ్యుతరావు బుధవారం మీడియాకు పరిచయం చేసారు. హోటల్ మెర్య్కూరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వితా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అన్వితా రెడ్డి, కోచ్ శేఖర్ బాబులను అన్విత గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుత రావు బొప్పన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అన్వితా రెడ్డి మాట్లాడుతూ తొలి నుండి తన పర్వతారోహణకు అన్ని రకాలుగా సహయ సహకారాలు అందింస్తున్న అన్వితా గ్రూపు అధినేతలు అచ్యుతరావు బొప్పన, నాగభూషణం బొప్పన, అనూప్ బొప్పన, శ్రీకాంత్ బొప్పనలకు తాను ఎంతో రుణపడి ఉంటానన్నారు.
సాహస క్రీడ కావడం, ఆర్థిక పరిస్ధితులు అనుకూలించక పోవటం, తల్లిదండ్రులను ఒప్పించడంతో సహా గత ఎనిమిదేళ్లుగా తాను ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు తన కల సాకారమైందన్నారు. అన్వితా గ్రూప్ ఎండి అచ్యుత రావు అందించిన ఆర్థిక సహకారం వల్ల, తాను ఆశయ సాధనపై ఏకాగ్రతతో దృష్టి పెట్టేగలిగానన్నారు. అన్వితా నిబద్ధత, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్ధ ఈ ప్రోత్సాహాన్ని అందించిందని అన్విత గ్రూపు అధినేత అచ్యుతరావు అన్నారు. భవిష్యత్తులో సైతం ప్రపంచ వ్యాప్తంగా విభిన్న శిఖరాలను అధిరోహించేందుకు అన్వితా గ్రూప్ తన మద్దతును కొనసాగిస్తుందని వివరించారు. కోచ్ శేఖర్ బాబు మాట్లాడుతూ అన్వితా రెడ్డి శారీరక, మానసిక ఓర్పుతో సరైన వరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, అనుభవాన్ని సంపాదించు కోగలిగారన్నారు. రాబోయే కాలంలో మరిన్ని విజయాల సాధనకు సిధ్దం కానుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.
విమానాశ్రయంలో ఘన స్వాగతం: దిగ్విజయంగా ఎవరెస్టును అధిరోహించి బుధవారం తొలిసారిగా సొంతగడ్డపై అడుగుపెట్టిన అన్వితాకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎవరెస్టు అధిరోహణకు స్పాన్సర్ గా వ్యవహరించిన అన్వితా గ్రూప్ ఎండి అచ్యుతరావు బొప్పన, డైరెక్టర్ నాగభూషణం బొప్పన తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాయదుర్గంలోని అన్విత గ్రూపు కార్పొరేట్ కార్యాలయాన్ని సందర్శించిన అన్విత భావోద్వేగానికి లోనయ్యారు. సంస్ధ అండదండలే తనను ఇక్కడి దాకా తీసుకువచ్చాయన్నారు. ఇక్కడ సంస్ధ డైరెక్టర్లు శ్రీకాంత్ బొప్పన, అనూప్ బొప్పన స్వాగతం పలికారు.
అన్వితా గ్రూప్ గురించి : అన్వితా గ్రూప్ అత్యుత్తమ జీవనశైలితో ఆదర్శవంతమైన చిరునామాలను రూపొందించే లక్ష్యంతో 2005లో స్థాపించబడింది. దుబాయ్‌లో సూపర్-లగ్జరీ, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లను రూపొందించడంలో విస్తృతమైన అనుభవాన్ని గడించింది. నిర్మాణ పరిశ్రమలో ప్రీమియం హౌసింగ్‌లో తొలి వరుస ఉన్నవాటిలో అన్వితా ఒకటిగా నిలిచింది. ఉత్తమమైన వాటిని అందించడానికి రాజీలేని వైఖరితో బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం, నాణ్యత పట్ల నిబద్ధత తన డిఎన్‌ఎలోనే ఇముడ్చుకుంది. దుబాయ్, హైదరాబాద్ ఇలా వారి ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ఇది ప్రతిబింబిస్తుంది. దుబాయ్‌లో ప్రీమియం మార్క్ ప్రాజెక్ట్‌ల ద్వారా జీవనశైలిలో నాణ్యతతో అన్వితా గ్రూప్ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచ స్థాయి గృహాలను అందించడం ద్వారా పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలకు వేదికగా మారింది.
Prajavartha Online Telugu News