విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ బదిలీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాకు డిస్టిక్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఎం.హెచ్ రెహమాన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన ఏ రవి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్ కు అకౌంట్స్ ఆఫీసర్ గా బదిలీపై వెళ్లారు. జిల్లాకు నూతనంగా నియమితులైన డిస్టిక్ ట్రెజరీ అండ్ ఎకౌంట్స్ ఆఫీసర్ ఎం హెచ్ రెహమాన్ కమిషనర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో అకౌంట్స్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించే వారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిటిఏఓ కు ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ సతీష్, సహాధ్యక్షులు ఎం జాన్సన్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు నాగేందర్రావు, గోపాల్, నరసింహారావు, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ రమణారావు, ఎస్ టి ఓ మల్లెశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News