Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఆశీస్సులతో కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ నందు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక గారి ఆధ్వర్యంలో నాగార్జున నగర్,కనకదుర్గ నగర్ నందు పార్క్ అభివృద్ధి పనులు మరియు కాపుల రామాయలయం దగ్గర సీసీ రోడ్డు నిర్మాణ పనులకు దాదాపు 1,00,00,00/- రూ ప్రభుత్వ నిధులతో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం కేవలం శంకుస్థాపన లకు పరిమితం కాకుండా వెనువెంటనే పనులు ప్రారంభించి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా త్వరగా పూర్తి చేస్తున్నామని,ఆ మేరకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ డివిజిన్లో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి కాలనీలలో అంతరగత రోడ్లు, పార్కు ల నిర్మాణలు పూర్తి చేయడం జరిగిందని, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి డివిజిన్ ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి తో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వనిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, కాలిని పెద్దల నారాయణ, కృష్ణ, సుబ్బారావు, యలమందరావు, వైస్సార్సీపీ నాయకులు ఏలూరి శివాజీ, భిమిశెట్టి బాబు, భిమిశెట్టి నాని, తాతారావు, మురళి, ప్రాంచి, సుబ్బు, ప్రవీణ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *