హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) ద్వితీయ కుమార్తె శ్వేత నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటి స్పీకర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన కాజా రామనాధం మనుమడు కాజా రఘుతో త్వరలో వివాహం జరుగుతుందని కేశినేని నాని తెలిపారు. కేశినేని శ్వేత, రఘుల నిశ్చితార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాల రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రహ్మణి దంపతులు, నందమూరి వసుంధర, ఈనాడు సంస్థల అధినేతలు చెరుకూరి కిరణ్, శైలజ దంపతులు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల టిడిపి అధ్యక్షులు కొనకళ్ల నారాయణ, నెట్టం రఘురామ్, టిడిపి ఎంపిలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, రవీంద్రకుమార్, పశ్చిమ బెంగాల్ పార్లమెంటు సభ్యురాలు మహువా మోయిత్రా, మాజీ ఎంపి కంభంపాటి రామమోహనరావు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, టి.డి.జనార్ధన్, తదితరులు హాజరై చిరంజీవులను ఆశీర్వదించారు.
Prajavartha Online Telugu News