Breaking News

మైనార్టీస్ కమిషన్ ఆఫీసులో అంబేద్కర్ కు ఘన నివాళి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా.బి. ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ కార్యాలయంలో మైనార్టీస్ చైర్మన్ డాక్టర్ కె ఇక్బాల్ అహ్మద్ ఖాన్ అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్  రచించిన రాజ్యాంగం తోనే దేశానికి దిశా దశ నిర్దేశం జరిగిందని, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందిందని అన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వైస్ చైర్మన్, కమిషన్ మెంబర్స్ ను, సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ డాక్టర్ జాషువా డానియల్ మరియు కమిషన్ మెంబర్స్ జితేందర్ జిత్ సింగ్, షేక్.సైఫుళ్ల, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *