Breaking News

జిల్లా పురోభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలి…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు తీసుకు వెళుతూ జిల్లా పురోభివృద్ధికి అధికారులంతా సమన్వయంతో కృషి చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి  కొట్టు సత్యన్నారాయణ అన్నారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్షా సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశమందిరంలో జరిగింది. జిల్లా సమీక్ష మండలి సమావేశంలో 13 శాఖలపై సుదీర్ఘంగా చర్చసాగింది. వ్యవసాయరంగం పై ఆధారపడిన జిల్లాలో పంటల ఉత్పత్తి పెరగటానికి అధికారులు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని ఉపముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ధాన్యం సాగుచేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తూ బాపట్ల జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల వద్ద బస్తాలు సిద్ధంగా ఉంచామన్నారు. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా పద్ధతి ప్రకారం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు. తుఫాను హెచ్చరికల నేపధ్యం లో మూడు రోజులపాటు ధాన్యం పంట కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానాలతో సమర్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు.

రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు వేసవి వార్షిక ప్రణాళికతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యన్నారాయణ చెప్పారు. ప్రజలకు తాగు నీటి సమస్య రైతులకు సాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాగు కాల్వల కింద ఆయుకట్టు చివరి భూములన్నింటికి జలవనరులు అందించేలా, కాలువల పూడిక తీత పనులు వేగంగా చేయాలన్నారు. ఎంపీ ల్యాడ్స్ కింద అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. రహదారుల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గుత్తేదారులను బ్లాక్ లిస్టులో ఉంచాలన్నారు. నిధులు మంజూరైనప్పటికీ నిర్మాణాలు చేపట్టకపోతే అధికారులు చూస్తూ ఉంటారా అని అసహనం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీలలో భూమి చదను చేయలన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఆక్వా సాగుకు డిమాండ్ తగ్గడంతో ఆక్వా సాగు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆక్వా రైతులకు కనీస ధర వచ్చేలా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. బాపట్ల జిల్లాలో ఆక్వా పార్క్ నిర్మాణానికి తక్షణం భూసేకరణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులు వేగంగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వేసవి సమయానికి సురక్షిత నీటిని అందించడం లక్ష్యంగా జల జీవన్ మిషన్ పనులు చేపట్టాలనారు. ప్రాథమిక వైద్యశాలల పై పర్యవేక్షణ కొరవైందన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్యశాలలను తనిఖీ చేయాలంటూ ఆ శాఖ ఆర్ డి కి నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. బాపట్ల జిల్లా కేంద్రంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పేద ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. వైద్యశాలలలో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆయన సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *