Breaking News

ఎంబిఎ విద్యార్ధులు ఒక్క నిముషం మేనేజర్ పుస్తకం చదవండి : ఆర్ టి సి ఎం. డి. ద్వారకా తిరుమల రావు

-కెఎల్ యు విద్యార్థులతో కాఫీ విత్ సి. ఈ. ఓ. కార్యక్రమం లో పలు సూచనలు చేసిన ఎపిఎస్ ఆర్ టి సి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజినెస్ మేనేజ్ మెంట్ లో మెళుకువలు తెలుసుకోవడం కోసం విద్యార్థులు ఒన్ మినిట్ మేనేజర్ అనే పుస్తకం చదవండంటూ కెఎల్ విశ్వవిద్యాలయం లో ఎంబిఎ చదువుతున్న విద్యార్థులకు సూచన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు తన దైన శైలిలో సమాధాన మిచ్చారు. గురువారం ‌నాడు ఆర్టీసీ హౌస్ లోని తన ఛాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేడు సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు పరిష్కార ధోరణి సూచించారు. యువత ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకెళితే అనుకున్నది సాధించ వచ్చని అన్నారు. మనం చేరాలనుకునే గమ్యం మనం వెళ్ళే దారి మీదనే ఆధారపడి ఉంటుందన్నారు. ప్రతి విద్యార్థి తన ఒక ప్రాధమిక అంశాలను మరువకూడదన్నారు. ప్రాధమిక అంశాలను నైపుణ్యం తో ఏవిదంగా వాడుకోవాలో తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రతి విద్యార్థి తల్లి దండ్రులు మనల్ని చూసి గర్వ పడేలా జీవించాలన్నారు. నాయకత్వ లక్షణాలతో విజయం సాధించ వచ్చు నన్నారు. మనకి ప్రతి విషయం మీద అవగాహన ఉంటే ఆధిక్యత వస్తుందన్నారు. భావి భారత అభివృద్ధి బాధ్యత విద్యార్థులపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ, ప్రో విసి.డాక్టర్ ఎన్.వెంకటరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.జగదీష్, అద్యాపకులు డాక్టర్ జెవి.రమణ, డాక్టర్ సిహెచ్.బాలాజి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *