-ఏపిఎన్జివో 21వ రాష్ట్ర మహా సభలకు వేలాదిగా ఉద్యోగులు తరలి వచ్చేలా కృషి చేయండి..
-సమావేశాలకు ముఖ్య అతిధిగా హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
-ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఈనెల 21,22 తేదిలలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఏపిఎన్జివో అసోసియేషన్ 21వ రాష్ట్ర మహాసభలు “ఛలో విజయవాడ” విజయవంతానికి చెపిసి నేతల పాత్ర కీలకమని అన్ని ప్రభుత్వ శాఖల ఉ ద్యోగులు వేలాదిగా తరలి వచ్చి సమావేశాలను జయప్రదం చేసేలా కృషి చేయాలని ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ బండి శ్రీనివాసరావు
ఈనెల 21,22వ తేదీలలో నిర్వహించనున్న “భలో విజయవాడ” సిఎన్జివో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహణ పై గురువారం విజయవాడ గాంధీ నగర్లోని ఏపిఎన్జివో హాల నందు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఫెన్షనర్ల జెఎసి సమావేశం రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుధీర్ఘ చరిత్ర కలిగిన పి ఎన్ఐవో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈనెల 21, 22 తేదిలలో విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని ఏ.పిఎస్ఈవో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించుకోవడం జరిగిందన్నారు. కౌన్సిల్ సమావేశాలకు జనాధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కావాడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ సారి కౌన్సిల్ సమావేశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించగా ఆయన అంగీకరించారన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆగస్టు 21,22 తేదిలలో నిర్వహించే రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా ఉద్యోగులు తరలివచ్చేలా జెఏసి నేతలు కృషి చేయాలని కోరారు. రెండు రోజులపాటు నిర్వహించే కొన్సిల్ సమావేశాలలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు డిమాండ్ లపై చర్చించి పలు తీర్మానాలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. సిపిఎస్ రద్దు.. పెండింగ్ డిఏల మంజూరు, న్యూ పే స్కేల్స్ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్ధీకరణ, జివిఎఫ్, ఎపిజిఎల్ఎ, నరండ్ లీవ్, రిటైర్మెంట్ బెన్ ఫిట్స్ విడుదల, ఉద్యోగుల హెల్త్ కార్డుల అమలు, ఎపిఎస్ఆర్ ఉద్యోగుల సమస్యలు వంటి వాటిని సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేలా హామీలను పొందేందుకు కృషి చేయనున్నామన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్ని సమావేశాలు విజయవంతం చేసి ప్రభుత్వానికి ఉద్యోగుల వాణిని వినిపించేలా జెఏసి నాయకులు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు కృషి చేయాలని బండి శ్రీనివాసరావు కోరారు. రాష్ట్ర జెఎసి సమావేశంలో రాష్ట్ర జెఏసి జనరల్ సెక్రటర్.జి. హృదయరాజు, డిప్యూటీ సెక్రటరీ కె.వి. శివారెడ్డి, కార్యవర్గ సభ్యులు హెచ్ తిమ్మన (ఎన్టీయు) కెఎస్ఎస్ ప్రసాద్ (యుటిఎఫ్) డి. చంద్రశేఖర్ (పబ్లిక్ సెక్టార్) బి శ్రీనివాసరావు (పంచాయతీరాజ్ మినిస్టీరియల్) యండి ఇక్బాల్ (అగ్రికల్చర్) ఐ రఘుబాబు ట్రాన్స్ ర్స్) కె. రవీంద్ర (పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ ) శోబాబ్బాబు | (ట్రజరీ సర్వీసెస్) సిహచ్ శ్రీనివాస్ (ఇరిగేషన్) ఎక్కవో అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిలారు జగదీశ్వరరావు, కోశాధికారి. ఎ. రంగరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News