
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సినీ, సీరియల్, షార్ట్ ఫిలిం నిర్మాణాలకు సంబంధించి వినియోగించే జటాయు క్యారవాన్‌ను వన్‌టౌన్ గాంధీజీ హైస్కూల్ ప్రాంగణంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మన విజయవాడ నగరంలో కూడా కుటుంబం మొత్తం కలిసి వెళ్లే చక్కటి జటాయు క్యారవాన్‌ను శ్రీ వెంకటేశ్వర మోటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఒక ఆరుగురు యువకులు ఒక టీమ్‌గా కలిసి మంచి ఆలోచనతో ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ఈ అద్భుత ఆలోచన చేశారని చెప్పారు. ఒక ఇంటిలో ఎన్ని మౌలిక సదుపాయాలు, ఎన్ని వసతులు ఉంటాయో అవన్నీ క్యారవాన్‌లో చూడొచ్చని చెప్పారు. ప్రతి మనిషికి అవసరమయ్యేవన్నీ ఈ క్యారవాన్‌లో ఉన్నాయని సెలబ్రిటీలు ఎలా బయటకు వెళ్తారో ఇప్పుడు ప్రతి కుటుంబం కూడా ఈ క్యారవాన్‌ను అలా ఉపయోగించుకోవచ్చని తెలియజేశారు. కావున నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. క్యారవాన్ నిర్మాహకులు వంశీ, వక్కలగడ్డ నాగప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిగా క్యారవాన్‌ను విజయవాడ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ క్యారవ్యాన్‌లో బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూం, ఫ్రిడ్జ్‌తో పాటు ఇండోర్ గేమ్ అవుట్డోర్ గేమ్స్ అవుట్డోర్ ప్రొజెక్టర్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. సెలబ్రిటీలే కాకుండా ప్రతి కుటుంబం వెళ్లే విధంగా మన నగరంలో దీనిని ప్రారంభించామని, చాలా తక్కువ ఖర్చుతో కుటుంబం అంతా విహార యాత్రకు వెళ్ళవచ్చని చెప్పారు. త్వరలో మరిన్ని నగరాలలో తమ క్యారవ్యాన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చటర్జీ, మైలవరపు మాధురి లావణ్య, నిర్వాహకులు పరిమి సునీల్ కుమార్ కొరిపాకుల వినయ్‌కుమార్, నటరాజ్ శేఖర్ సురేంద్రరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, మురళి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News