Breaking News

ఎంసెట్‌ మూడవ విడత కౌన్సిలింగ్‌ నిర్వహించాలి…ఎన్‌ఎస్‌యుఐ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంసెట్‌ రాసిన విద్యార్థులకు మూడవ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్‌ గురువారం ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు లేఖ రాయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఈయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖ మంత్రి స్పందించి 1వ, 2వ కౌన్సిలింగ్‌ నిర్వహించిన ప్రభుత్వం మూడవ కౌన్సిలింగ్‌ నిర్వహించాలని, చాలామంది విద్యార్థులు మూడవ నోటిఫికేషన్‌ ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఒకటి, రెండు కౌన్సిలింగ్లో హాజరైన విద్యార్థులకు మరియు ఇతర ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా మూడవ కౌన్సిలింగ్లో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేవలం ఒకటి రెండు కౌన్సిలింగ్లలో 77% మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయని మిగతా 27,590 సీట్లు ఖాళీగా ఉన్నాయని, 13 వేల మందికి పైగా విద్యార్థులు మూడవ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తే వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. దీనిపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరడం జరిగిందని నాగ మధు యాదవ్‌ తెలిపారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ నిర్వహించాలని తెలిపారు. మూడవ కౌన్సిలింగ్‌ నిర్వహించలేని తరుణంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని, ఉన్నత విద్యా మండలి కార్యాలయంను ముట్టడిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *