Breaking News

ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి – వెలంపల్లి శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు

-కనీ విని ఎరుగని రీతిలో జగన్న ఆరోగ్యం సురక్ష శిబిరాలు – రాయన భాగ్యలక్ష్మి, నగర మేయర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్న ఆరోగ్యం సురక్ష కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ఆరు సచివాలయ పరిధిలో శుక్రవారం క్యాంప్ నిర్వహించారు . 40,42,45, 48 ,53, 55వ డివిజన్లో ఒక్కొక్క సచివాలయంలో ఆరు చోట్ల ఈ క్యాంప్ నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ క్యాంపులకి విశేష స్పందన వచిందన, గౌరవ ముఖ్యమంత్రి  ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశం తో ప్రతి ఇంటికి ఏడు రకాల టెస్టులు చేయించడం ఆ టెస్టుల ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్లకి ఆ మెడిసిన్స్ ఏ కాదు ఏమైనా పెద్ద ట్రీట్మెంట్ ఉంటే ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళకి రిఫర్ చేయచ్చడం అవన్నీ కూడా వాళ్ళకి వ్యాధి నయం అయ్యేవరకు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అనేది చక్కటి అవకాశం గా ప్రజలందరూ భావిస్తారని. ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ కి సంబంధించి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో కుటుంబాలకి ఆయన ఆధారం కల్పించారని, అదేవిధంగా ఈరోజు దానికి రెండు అడుగుల ముందుకు వేసి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ద్వార కొన్ని లక్షల మందికి వ్యాధిని పరీక్షించడం, వాటికి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేయించడం మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదంతా కూడా చాలా చక్కటి కార్యక్రమని ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరుకున్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్య సురక్ష శిబిరం ద్వారా వాలంటీర్లు, ఏ ఎన్ యంలు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఒక గడపకు వెళ్లి రక్త పరీక్షలు చేసి వాళ్లకున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి వాళ్ళను ఆరోగ్యవంతులుగా చేస్తున్నారని. ప్రతి ఒక్కరూ ఈ శిబిరాన్ని సద్వినియోగించుకోవాలని. కనీ విని ఎరుగని రీతిలో క్వాలిఫైడ్ డాక్టర్లచే ఈ సిబిరంలో వాళ్లకి నిర్ధారించిన వ్యాధులకు వాళ్లకి సంవత్సరం పాటైనా సరే రక్త పరీక్షలు మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ శిబిరంలో మందులకు తగ్గినవి ఏవైనా సమస్యలు ఉన్నచో ఆరోగ్యశ్రీ ద్వారా పెద్ద ఆసుపత్రులకు పంపించి పూర్తిగా ఆరోగ్యవంతులుగా చేసేదాకా జగనన్న సురక్ష వాళ్లకు తోడుగా ఉంటుందని. 172 రకాల మందులు అందుబాటులో ఉన్నైఅని. ఎటువంటి ఆరోగ్య సమసైనా జగన్నన ఆరోగ్య సురక్ష సిబరం ద్వార ప్రజలకు ఆరోగ్యవంతులు చెయ్యడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు యరడ్ల అంజనేయ రెడ్డి,పడిగపాటి చైతన్య రెడ్డి,మైలవరపు మాధురి లావణ్య,కృష్ణ,అత్తులూరి ఆదిలక్ష్మి,పెద్దబాబు,మహదేవు అప్పజీరావు,శిరంశెట్టి పూర్ణచంద్రరావు,జిల్లా వైద్య శాఖ అధికారి సుహాసిని,తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *