కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అవినీతిరహితంగా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 172వ రోజు పర్యటనను చాగల్లు మండలం మల్లవరం శుక్రవారం నిర్వహించారు. మెయిన్ రోడ్డులో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు బాటలు వేసిందన్నారు. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంక్షేమాభివృద్ధి ద్వారా రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుండి ఆరు శాతానికి తగ్గిందన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. అందుకే ప్రజలందరూ ముఖ్యమంత్రి జగనే మా నమ్మకం, మా భవిష్యత్ అంటూ జననీరాజనం పలుకుతున్నారన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News