Breaking News

ఎయిడ్స్‌ వ్యాధి పై అవగాహన కు బహిరంగ చర్చ అవసరం..

-ఎయిడ్స్‌ బాధితుల లో మనో ధైర్యాన్ని నింపుదాం.
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎయిడ్స్‌ నియంత్రణ కు బహిరంగ చర్చ అవసరమని సమాజంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వున్నప్పుడే ఎయిడ్స్‌ వ్యాధిని సమూలంగా రూపు మాప గలుగుతామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీ రావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎపి ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే స్టేడియం నుండి నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా బహిరంగ చర్చ అవసరమని అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు స్వచ్చంద సంస్థల భాగస్వామ్యం వలన వ్యాధి గ్రస్తుల సంఖ్య నానాటికీ తగ్గు ముఖం పట్టడం శుభ పర్న్‌ పరిణామం అన్నారు. లైంగిక జీవనంలో అడ్డదారులు తొక్కడం వల్ల అనేక అనర్ధాలు కలుగుతాయన్నారు. ముఖ్యంగా ఎయిడ్స్‌ వ్యాధిబారిన పడి అనేక మంది జీవితాన్ని కోల్పోతున్నారన్నారు. కండోమ్స్‌ వాడకం వలన ఎయిడ్స్‌ వ్యాధి బాధితుల సంఖ్య గననీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, రైల్వే స్టేషన్లు, బస్టాండులు వంటి రద్దీ ప్రాంతాలలో కండోమ్స్‌ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగ నిపుణులు వైద్యకృషి ఫలితంగా కొన్ని మందులు అందుబాటులోకి రావడంతో ఎయిడ్స్‌ నియంత్రణ జరిగి రోగులు సాధారణ జీవితాన్ని గడిపేలా వీలుకలిగిందన్నారు. మానవ నైజాన్ని మార్చుకుని క్షణికానందంతో అసాంఫీుక పద్దతులకు దూరంగా వుండాలన్నారు. తెలియని వ్యక్తులతో లైంగిక కార్యకలపాలకు పాల్పడకూడదన్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పిదాల వలన వారి నుండి అభంశుభం తెలియని చిన్నారులు వ్యాధి సోకడం బాధకరమన్నారు. జిల్లాలో సుమారు 17 వేల మందికి పైగా హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగిందన్నారు. హెచ్‌ఐవి ఎయిడ్‌స వ్యాధిస్తుల పట్ల సంఫీుభావం తెలిపి వారికి పౌష్టికాహారం మందులను అందించి జీవన ప్రమాణాలను పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. హెచ్‌ఐవి వ్యాధిభారిన పడిన వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య చికిత్సలు, పౌష్టికాహారం అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు ముందుకు వచ్చే స్వచ్చంద సంస్థలకు ప్రభుత్వ పరమైన సహయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్స్‌తో ముచ్చటిస్తూ ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రిస్తామని స్వచ్చందగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ట్రాన్స్‌జెండర్స్‌ జీవన విధానన్ని మార్చుకుని సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ప్రభుత్వ పరంగా సహాయం అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
ఎయిడ్స్‌ నియంత్రణ అవగాహన ర్యాలీలో ఎపి ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డా. ఎస్‌ పి. రాజేంద్ర ప్రసాద్‌ లింగంశెట్టి, ఏపిడి డా. కోటేశ్వరి. జాయింట్‌ డైరెక్టర్‌ డా.వై.కామేశ్వర ప్రసాద్‌. డా మంజుల, డా. కె. సుబ్రహ్మణ్యం, పెఫార్‌ కో ఆర్డనేటర్‌ డా.రాజేంద్ర ప్రసాద్‌, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా.ఎం.సుహాసిని, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారిణి జె. ఉషారాణి, పలువురు ప్రభుత్వ వైద్యులు వివిధ కళాశాలల విద్యార్దిని విద్యార్థులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *