Breaking News

హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు..

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు టౌన్ లో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆధ్వర్యంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో మంత్రి తండ్రి మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీ రావు ఆశీర్వదం తీసుకుని.. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను ఆమె ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు, నాయకుల సమక్షంలో హోంమంత్రి ఆదివారం అర్థరాత్రి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకగా… సోమవారం నుంచే మళ్లీ హోంమంత్రికి శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, అభిమానుల మధ్య భారీ కేక్ లు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, నాయకులతో పాటు.. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు పలువురు హాజరై స్వీట్లు, పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ కేక్ లను కట్ చేసి కేకులు, స్వీట్లును అందజేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో కుమారదేవం గురుకుల పాఠశాల విద్యార్థినులు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అలరించిన పాట అందరినీ ఆకట్టుకుంది. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కలిసి హోంమంత్రికి ఒక్కసారిగా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ యువత, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో భారీ కేక్ లను కట్ చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం 2024 లో కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలు , ఉప్పొంగే ఉత్సాహంతో మనమందరం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన ఉత్సాహాన్ని అందించి వెలుగులు నింపాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో , సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో, జీవించాలని నిండు మనసుతో అందరికీ హోంమంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *