హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును గురువారం పరామర్శించారు. సీఎం జగన్ బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళారు. ఆయనకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఏపీ సీఎం రాక నేపథ్యంలో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. కేసీఆర్ తనయుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఏవీ సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ సీఎం జగన్… కేసిఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Prajavartha Online Telugu News