
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ లు బుధవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పృథ్వీరాజ్, జానీ మాస్టర్ లకు పార్టీ కండువాలు మెడలో వేసి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని, పార్టీ విధానాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఇరువురికి పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో చురుగ్గా ముందుకు వెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ తన కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు.
Tags hyderabad
Check Also
రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి
-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …
Prajavartha Online Telugu News