

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
సుజాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై గల్లా జ్ఞాన శేఖర్ నిర్మాతగా, సహజకవి అయినాల మల్లేశ్వరరావు స్టోరీ రైటర్ గా, వరల్డ్ రికార్డ్ హోల్డర్, సీనియర్ జర్నలిస్టు కనపర్తి రత్నాకర్ దర్శకత్వం లో రూపొందిన దేశ భక్తి చిత్రం వీరస్థలి తెనాలి ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. గతంలో ఇదే చిత్రానికి మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చేతులు మీదుగా మిరాకిల్ అవార్డును చిత్ర దర్శకుడు కనపర్తి రత్నాకర్ అందుకున్నారు. కాగా సోమవారం ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దర్శకుడు రత్నాకర్ కు, స్టోరీ రైటర్ అయినాల మల్లేశ్వరరావు కు, నిర్మాత గల్లా జ్ఞాన శేఖర్ లకు రికార్డ్ నమోదు పత్రాలను, ధృవీకరణ పత్రాలను అందించింది. తమ చిత్రానికి అవార్డులు రావడం పట్ల చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. పలువురు ప్రముఖులు వీరస్థలి తెనాలి టీమ్ అభినందించారు. దర్శకుడు రత్నాకర్ నటీనటులు జీవన్ శ్రీ, వెంకట్, సోమేష్, మధుకర్, అబ్రహాం లింకన్, వీరయ్య, కృపానందం, వెంకటేశ్వర రావు, వసంత యామిని తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఇదే బ్యానర్ పై రత్నాకర్ దర్శకత్వం లో పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు నిర్మాత జ్ఞాన శేఖర్ చెప్పారు.
Prajavartha Online Telugu News