Breaking News

తమ్ముడికి మెగాస్టార్ భారీ విరాళం


హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల నిర్వహణ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం చెక్కుల రూపంలో అందించారు. హైదరాబాద్ నగర శివారులో ముచ్చింతల్ దగ్గర జరుగుతున్న విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో వున్న చిరంజీవిని ఇవాళ అన్న నాగబాబుతో కలసి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు పవన్. విజయోస్తు అని చిరంజీవి ఆశీర్వదించారు. కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. అక్కడే వున్న ఆంజనేయ స్వామి విగ్రహంకు దండం పెట్టుకుని చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్. అక్కడే ఐదు కోట్ల విలువ కలిగిన చెక్స్ అందించారు. ఇది చిన్న మొత్తమే అని, అడగకపోయినా ప్రజల కోసం కష్టపడుతున్నందుకు తాను ఇస్తున్న కానుక అని ఆశీర్వదించారు. విజయంతో తిరిగి వచ్చి కలుస్తానని పవన్ కళ్యాణ్ భరోసాగా తెలిపారు. విజయీభవ అని చిరంజీవి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *