Breaking News

ఐక్యంగా ముందుకు సాగుదాం… వికసిత భారత్‌ వైపు అడుగులు వేద్దాం…

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్‌ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడిస్తోన్నారు. ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ముందుగా దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం అని అన్నారు. హర్‌ఘర్‌ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయన్నారు. దేశం కోసం తమ జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ఈ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలకు ఈ దేశం రుణపడి ఉందని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్ల మంది పోరాడారని గుర్తు చేశారు. ఇవాళ దేశ జనాభా 140 కోట్లకు చేరుకుందని, మనమంతా వారి కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలిపారు. వికసిత భారత్‌ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని అందుకోవడానికి రూపొందించుకున్న భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. వారిని ఆజాదీ కే దీవానేగా అభివర్ణించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారికి మోదీ నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వాతంత్య్రం కోసం 40 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడారని గుర్తు చేశారు. వారి పోరాటం 140 కోట్ల మంది దేశ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఇన్ని కోట్లమంది ప్రజల సంకల్పం.. ఇప్పుడు సరైన దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉందని, 2047 నాటికి అన్ని అడ్డంకులను అధిగమించి విక్షిత్‌ భారత్‌గా మారవచ్చని అన్నారు. తాము తీసుకొచ్చిన వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే కాన్సెప్ట్‌ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తోందని వ్యాఖ్యానించారు మోదీ. దీని కింద దేశంలో ప్రతి జిల్లా కూడా సొంత ఉత్పత్తులపై చేపట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు సరైన దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉందని, 2047 నాటికి అన్ని అడ్డంకులను అధిగమించి విక్షిత్‌ భారత్‌గా మారవచ్చని అన్నారు. తాము తీసుకొచ్చిన వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే కాన్సెప్ట్‌ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తోందని వ్యాఖ్యానించారు మోదీ. దీని కింద దేశంలో ప్రతి జిల్లా కూడా సొంత ఉత్పత్తులపై చేపట్టిందని గుర్తు చేశారు. వచ్చే అయిదు సంవత్సరాల్లో దేశంలో కొత్తగా 75,000 మెడికల్‌ సీట్లను సృష్టించబోతోన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీనివల్ల వికసిత్‌ భారత్‌.. స్వాస్త్య భారత్‌గా ఆవిర్భవించగలుగుతుందని పేర్కొన్నారు. వైద్య రంగంలో సరికొత్త విప్లవాలకు నాంది పలకబోతోన్నామని తేల్చి చెప్పారు. అంతకుముందు తన అధికారిక నివాసం నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ.. నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మోదీకి పలువురు కేంద్రమంత్రులు, ఢల్లీి లెప్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా స్వాగతం పలికారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *