Breaking News

Tag Archives: guntur

రెవిన్యూ వసూళ్ళ పై ప్రత్యేక సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరాభివృద్దిలో ఆస్తిపన్ను వసూళ్లు కీలకమని, ప్రతి వార్డు సచివాలయం పరిధిలో బకాయిలు మరియు ప్రస్తుత పన్ను నూరు శాతం వసూళ్లు చేసేలా అడ్మిన్ కార్యదర్శులు మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, అధికారులు కృషి చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో రెవిన్యూ వసూళ్ళ పై ప్రత్యేక సమీక్షా సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ …

Read More »

జి.జి.హెచ్ లో మెలోడీయోసిస్ పై విజయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సమగ్ర వైద్యశాల మెలోడీయోసిస్ పై విజయం సాధించింది. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంకు చెందిన పి. ఎలీషా (42 సంవత్సరాలు) గత ఆగస్టు 21న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో తీవ్రమైన జ్వరము, కీళ్ల నొప్పులుతో చేరడం జరిగింది. అప్పటికి తురకపాలెంలో కొత్త వైరస్ కనుగొన్నారు అంటూ కొన్ని పుకార్లు నెలకొన్న సందర్భంలో ఈ పేషెంట్ ని కూడా ప్రత్యేక దృష్టితో పరీక్షలు అన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు సూపరిండెంట్ ఎస్ ఎస్ వి రమణ …

Read More »

కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు . జె.గిరిబాబు (55వ సచివాలయం), ఏ.జీవన్ ప్రభు కళ్యాణ్ (121వ సచివాలయం) ప్లానింగ్ కార్యదర్శులు అనుమతి లేకుండా సమీక్షా సమావేశాలు హాజరు కాకపోవడం, పట్టణ ప్రణాళిక విభాగ క్షేత్ర స్థాయి విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంపై గురువారం విధుల నుండి సస్పెండ్ చేశామని, కార్యదర్శులు భాధ్యతగా విధులు నిర్వహించాలన్న కమిషనర్  ఇక నుండి ప్రతి రోజు సచివాలయ …

Read More »

23వ తేదీలోపు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)లో దరఖాస్తు చేసుకోవాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనధికార లే అవుట్స్, ప్లాట్స్ ని ఈ నెల 23వ తేదీలోపు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)లో దరఖాస్తు చేసుకోవాలని, చేసుకోని వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి వార్డ్ సచివాలయం పరిధిలోని అనధికార లే అవుట్స్ …

Read More »

జిఎంసి కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహించే ప్రజారోగ్య, ఇంజినీరింగ్ కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యలపై ఫిర్యాదులు, అర్జీలు అందించేందుకు ఈ నెల 17న (శుక్రవారం) సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »

నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలన, పర్యవేక్షణకు సంయుక్త కమిటి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలన, పర్యవేక్షణకు వివిధ రంగాల నిష్ణాతులతో ఒక సంయుక్త కమిటి ఏర్పాటుకు త్వరలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో గుంటూరు నగర రేట్ పేయర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ప్రజల సౌకర్యార్ధం నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం మరింత ప్రణాళికాబద్దంగా, నాణ్యతా …

Read More »

అన్న క్యాంటీన్ల పరిసరాల్లో ఆహ్లాదాన్ని అందించేలా మొక్కలు నాటాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్న క్యాంటీన్ల పరిసరాల్లో ఆహ్లాదాన్ని అందించేలా మొక్కలు నాటాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పల్నాడు బస్టాండ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో పచ్చదనం ఉండేలా మొక్కలను జిఎంసి నుండి అందిస్తున్నామని, వాటిని అక్షయ పాత్ర సిబ్బంది నాటి పర్యవేక్షణ చేయాలన్నారు. …

Read More »

త్రాగునీటిని అందించే హెడ్ వాటర్ వర్క్స్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరానికి త్రాగునీటిని అందించే హెడ్ వాటర్ వర్క్స్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది మినహా ఇతరులను లోనికి రానివ్వద్దని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ జిఎంసి హెడ్ వాటర్ వర్క్స్, మానససరోవరం దగ్గర కల్వర్ట్, ఆర్టీసి కాలనీ, చిన్నేరు కుంట, కోబాల్ట్ పేటలో పీకలవాగు ఆక్రమణలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజలకు …

Read More »

అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు ఉండరాదు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు ఉండరాదని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా నిల్వలు, విక్రయాలుపై సంబంధిత అధికారులతో మంగళవారం టెలి కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో బాణాసంచా తయారీ, విక్రయాలు, నిలువలు, రవాణా తదితర సందర్భాల్లో ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు, అవాంచిత సంఘటనలు జరగరాదని స్పష్టం చేశారు. నిబంధనలు అమలు అధికారులు పక్కాగా వ్యవహరించాలని, వారు చేపట్టిన అంశాలను ప్రజలకు తెలియజేసి చేపడుతున్న పర్యవేక్షణ పట్ల …

Read More »

అనుమతి లేని అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని వ్యాపారులు స్వచ్చందంగా ఖాళీ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఉత్తర్వుల మేరకు అనధికార హోల్సేల్ కూరగాయల వ్యాపారాలు చేస్తున్న అనుమతి లేని అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని వ్యాపారులు స్వచ్చందంగా ఖాళీ చేయాలని, లేకుంటే కోర్ట్ ఉత్తర్వుల మేరకు బుధవారం జిఎంసి అధికారులు సీజ్ చేస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పస్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారదా హోల్సేల్ మార్కెట్ లో మాత్రమే రైతులు తమ కూరగాయలను విక్రయించుకోవడానికి అనుమతులు ఉన్నాయని, అనుమతులు లేకుండా జాతీయ రహదారి సర్వీస్ రహదారిలో, నిర్దేశిత …

Read More »