Breaking News

Tag Archives: guntur

ప్రజా ఫిర్యాదుల పట్ల భాధ్యతగా ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఉద్యోగ నియామక పత్రం అందించిన రికార్డ్ అసిస్టెంట్ ఎస్.నాగేశ్వరరావుని, ప్రజా ఫిర్యాదులు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శి వై.త్యాగరాజుని విధుల నుండి సస్పెండ్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిఎంసి సర్కిల్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే ఎస్.నాగేశ్వరరావు కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, విజయవాడకు …

Read More »

ప్రతి కమర్షియల్ సంస్థకు డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి…

గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రతి కమర్షియల్ సంస్థకు డి&ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, రోడ్లు, డ్రైన్లపై ఉన్న ఆక్రమణలకు లైసెన్స్ లు జారీ చేయవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సామవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, కార్యదర్శులతో ట్రేడ్ లైసెన్స్ లు, పారిశుధ్య పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయాల వారీగా డి&ఓ ట్రేడ్ లైసెన్స్లు ఉండాల్సిన సంఖ్య కన్నా …

Read More »

ఎక్కడైనా పైప్ లైన్ లీకులు గుర్తిస్తే తక్షణ మరమత్తు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ సరఫరా చేసే త్రాగునీటిని ఎప్పటికప్పుడు క్లోరిన్ టెస్ట్ చేయాలని, ఎక్కడైనా పైప్ లైన్ లీకులు గుర్తిస్తే తక్షణ మరమత్తు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ భారత్ పేట, అరండల్ పేట, అశోక్ నగర్, రెడ్డిపాలెం తదితర ప్రాంతాల్లో పిజిఆర్ఎస్, డయల్ యువర్ కమిషనర్ లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులను నేరుగా పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు …

Read More »

“బిల్డింగ్ డెవలపర్స్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిర్మాణ రంగ వస్తువులపై జిఎస్టీ తగ్గింపు ద్వారా సామాన్యులకు ఇంటి నిర్మాణం సులభమయ్యే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “బిల్డింగ్ డెవలపర్స్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్” అంశంపై క్రెడాయ్, నరేడ్కో, బిఏఐ సభ్యులు, బిల్డర్లు, డెవలపర్లు, కాంట్రాక్టర్లు, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయర్లు (సిమెంట్, పెయింట్స్, ఇంటీరిర్, ఎక్స్టీరియర్), హార్డ్‌వేర్ షాపుల ఎగ్జీబిషన్ స్థానిక ఏసి కాలేజి సెమినార్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

జిఎస్టీ తగ్గింపు నిర్ణయం ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి దోహదపడుతుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుతం తీసుకున్న జిఎస్టీ తగ్గింపు నిర్ణయం ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి దోహదపడుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “జిఎస్టీ 2.0 సంస్కరణల వల్ల భవిష్యత్ ఆర్ధిక ధోరణులు” అంశంపై నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రత్యేక అధికారి చల్లా ఓబులేసు అధ్యక్షతన ఆర్ధిక నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపారవేత్తలతో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

బిల్స్ నిధి పోర్టల్లో అప్ లోడ్ అంశంపై సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బిల్లులను నిధి పోర్టల్ ల్లో ఈ నెల 16వ తేదీలోపు చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బిల్స్ నిధి పోర్టల్లో అప్ లోడ్ అంశంపై నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తమ చాంబర్ లో ఇంజినీరింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మేయర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ …

Read More »

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, పర్యవేక్షణ కోసం విధులు కేటాయించిన వార్డ్ సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షణ చేసి, ఏమైనా లోపాలు గుర్తిస్తే నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పల్నాడు బస్టాండ్ సెంటర్లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ల పరిసరాల్లో ఆహారం తీసుకునే వారికి ఇబ్బంది లేకుండా …

Read More »

ప్రధాన రోడ్లకు ఇరువైపులా, డివైడర్లలో మొక్కలను విరివిగా నాటాలి….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో రోడ్లకు ఇరువైపులా, డివైడర్లలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా ఆహ్లాదాన్ని అందించే మొక్కలను నాటాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఉద్యావన విభాగ, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ జెకెసి కాలేజీ రోడ్, సమ్మర్ పేట, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఈ సీజన్ లో మిషన్ …

Read More »

పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలి….

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను నిర్దేశిత గడువు మేరకు పరిష్కారం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …

Read More »

“బిల్డింగ్ డెవలపర్స్ మరియు కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్”

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో “బిల్డింగ్ డెవలపర్స్ మరియు కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్” అంశంపై క్రెడాయ్, నరేడ్కో, బిఏఐ సభ్యులు, బిల్డర్లు, డెవలపర్లు, కాంట్రాక్టర్లు, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ సప్లయర్లు (సిమెంట్, పెయింట్స్, ఇంటీరిర్, ఎక్స్టీరియర్), హార్డ్‌వేర్ షాపులు, ఇతర సంబంధిత వ్యక్తులకు ఎగ్జిబీషన్, అవగాహన కార్యక్రమం ఈ నెల 14 (మంగళవారం) ఉదయం 10 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఏసి కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని నగర …

Read More »