Breaking News

Tag Archives: rajamandri

జిల్లాలో శాప్ లీగ్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ Sports Authority of Andhra Pradesh (విజయవాడ) వారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ వారి ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో శాప్ లీగ్స్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి తెలిపారు. ఈ లీగ్స్‌లో భాగంగా మార్చి 24వ తేదీన జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు మరియు ఎంపికలు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించబడతాయి. 35 ప్లస్ మరియు 45 ప్లస్ వయో …

Read More »

నిడదవోలు మండలం సెట్టిపేటలో లేస్–ఎంబ్రాయిడరీ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ కీర్తి చేకూరి

తూర్పు గోదావరి జిల్లా / నిడదవోలు,  నేటి పత్రిక ప్రజావార్త : మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం – స్వయం ఉపాధితో ఆర్థిక సాధికారత లక్ష్యం నేపథ్యంలో నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వహిస్తున్న యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చేతి అల్లికలతో అందంగా తీర్చిదిద్దిన వివిధ రకాల దుస్తులను పరిశీలించి, లేస్ వర్క్ మరియు ఎంబ్రాయిడరీ రంగాల్లో మహిళలు చూపిస్తున్న ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. తరతరాలుగా ఈ కుటుంబ సభ్యులు …

Read More »

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి… : కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : “దివ్యాంగ శక్తి” పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్థానిక హైటెక్ బస్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి , కలెక్టర్ కీర్తి చేకూరి లు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి ఉత్సాహం నింపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, రుడా …

Read More »

“రైతన్నా.. నేనున్నా”..

-విత్తనం నుండి విక్రయం వరకు ప్రభుత్వానిదే బాధ్యత- రైతాంగానికి మంత్రి కందుల దుర్గేష్ భరోసా -కాపవరం గ్రామంలో విస్తృత పర్యటన..”రైతన్నా మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -నిడదవోలు నియోజకవర్గంలో 19,315 మంది రైతుల నుండి ధాన్యం సేకరించి రూ. 38.54 కోట్ల నిధుల జమ చేశామని వెల్లడి -కాపవరం అభివృద్ధికి రూ. 1.94 కోట్లు వ్యయం చేశామని స్పష్టం..పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -ఇంటింటికీ వెళ్లి రైతులతో నేరుగా ముఖాముఖి.. అన్నదాతల సమస్యలు,సాగు అవసరాలు, ఎరువుల లభ్యతపై ఆరా..కూటమి …

Read More »

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి… : ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

-హుకుంపేట నుంచి కడియం వరకు తిరిగి రాజమండ్రి ఎంపిడివో కార్యాలయం వరకు బస్సులో ప్రయాణం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల -‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్,  నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని దివ్యాంగులు అన్ని రంగాలలోనూ రాణించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకాంక్షించారు. బుధవారం స్థానిక రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద ‘దివ్యాంగ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …

Read More »

విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా సంక్షేమం అమలు

-‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ -దివ్యాంగులకు ప్రభుత్వం చేయూత: ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యం నింపేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్ ఎల్ సి సోము వీర్రాజు లు విభిన్న ప్రతిభావంతులతో కలిసి …

Read More »

రాజకీయాల్లో పదవీ విరమణ ఉండదు.. ప్రజల్లో ఉంటేనే మానసిక ప్రశాంతత: మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్, స్టాంప్ ఆవిష్కరణ -పదవీకాలం ముగిసిన మున్సిపల్ పాలకవర్గానికి అభినందనలు -వివిధ సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల స్థలాల పట్టాల పంపిణీ -వేసవి దృష్ట్యా ఆర్టీసీ డిపో వద్ద చలివేంద్రం ప్రారంభం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు పట్టణ మున్సిపల్ కౌన్సిల్ హాలులో నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. నిడదవోలు పురపాలక సంఘం 60 …

Read More »

రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు ఇంటి వద్దనే పరిష్కారం

– జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తూర్పు గోదావరి జిల్లా (కడియం,) నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “రైతన్న మీకోసం” కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కడియం గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి వారితో ముఖాముఖి మాట్లాడి పంటల పరిస్థితి, సాగు విధానాలు మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట …

Read More »

క్షయ వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి

-జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. ఎం. వసుంధర రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్షయ రోగుల సంఖ్య తగ్గిందని, వ్యాధిని పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు వార్డు, గ్రామ, పట్టణ ప్రాంతాలు మరియు విద్యాసంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారిణి డా. ఎం. వసుంధర పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం …

Read More »

పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ పై హై లెవెల్ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) పై హై లెవెల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ సి.హెచ్. రాజ్ గోపాల్ రావు మరియు డి ఎల్ ఎస్ ఎ …

Read More »