విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీరామావు అంతటి చరిష్మా ఉన్న నాయకుడు నారా లోకేష్ అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్ అన్నారు.
సోమవారం గణపతిరావు రోడ్డు లోని ఖిద్ మత్ ఘర్ కార్యాలయంలో ఫతాఉల్లాహ్ ముస్లిం మత గురువులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ అనేక సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్తగా ఒక క్రియాశీల నాయకుడిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలబడ్డ నాయకుడు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రాష్ట్రంలో కోటి మంది తీసుకున్నారంటే అది నారా లోకేష్ ప్రయత్నమే అని అన్నారు. నారా లోకేష్ ను ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుతు న్నారని, కావున ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా స్పందించి ప్రజల కార్యకర్తల అభీష్టం మేరకు నారా లోకేష్ ను ఉపముఖ్యమంత్రిగా నియమించాలని కోరారు.
ఈ సమావేశంలో మౌలానా సత్తార్ ఖాన్, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, విజయవాడ పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు. తమేం అన్సార్, 57 డివిజన్ అధ్యక్షుడు జహెద్, ఇంకా అనేక ముస్లిం మత గురువులు పాల్గొన్నారు.