Breaking News

రూ.1లక్షల యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండ‌లం కొత్త రేపూడి గ్రామానికి చెందిన జి.మంగ‌సాయి త‌న గుండె సంబంధిత చికిత్స కోసం తక్షణ ఆర్ధిక సాయంకై సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకున్నారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ సూచ‌న‌ల మేర‌కు మంజూరైన రూ.1లక్షల యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి ని సోమ‌వారం జి.మంగ‌సాయి భ‌ర్త జి.వి.రామ‌ప్ర‌సాద్ కి ఎంపి కార్యాలయ సిబ్బంది అందజేశారు. తన భార్య మంగ‌సాయి వైద్యానికి సీఎంఆర్ ఎఫ్ ద్వారా సాయం అందించినందుకు ఎంపి కేశినేని శివనాథ్ కి, ఎంపి కార్యాలయ సిబ్బందికి జి.వి.రామ‌ప్ర‌సాద్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వో.ఎస్.డి వెంకటరత్నం, ముల్పూరి కిషోర్, బాలినేని మోహనరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *