కరాటేలో ప్రతిభ చూపిన విద్యార్థికి ఆర్థిక సాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కరాటేలో ప్రతిభ కనపరిచిన తంగా తేజశ్రీ సాయికి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆర్థిక సాయం అందించారు. ఊర్మిళ నగర్ లోని మమతా దేవి విద్యానికేతన్ కు చెందిన తేజశ్రీ సాయి ఈ నెల పంజాబ్ లుధియానాలో జరగనున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ 8వ తరగతి చదువుతున్న తంగా తేజశ్రీ సాయిను అభినందించారు. 13 ఏళ్ల వయసులోనే అండర్ -14 విభాగంలో జాతీయస్థాయిలో రాణించేలా ప్రోత్సహించిన తల్లితండ్రులను కొనియాడారు. చిన్నారి తేజశ్రీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కూటమి నేతలు పత్తి నాగేశ్వరరావు, బొమ్ము గోవిందు, రవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *