Breaking News

డిసెంబర్ 9 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ – మీకోసం

-కలక్టరేట్ లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం, ఇతర సేవలు
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి “పిజిఆర్ఎస్ – మీ కోసం” కార్యక్రమం డిసెంబర్ 9 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పి జి ఆర్ ఎస్ కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా స్థాయి అధికారులు సోమవారం  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. మునిసిపల్, మండల స్థాయి  లో సంబంధిత అధికారులకు ప్రజా సమస్యలు పరిష్కార వేదిక లో ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు.  మండల స్థాయి  అధికారులు అందరూ మండల ప్రధాన కేంద్రంలో ప్రజల నుంచి ఒకే చోట అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించాలన్నారు.

ప్రత్యేక ఆధార్ కేంద్రం:
కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రం ద్వారా ఆధార్ అనుబంధంగా పేరు మార్పు, చిరునామా , ఫోన్ నెంబర్, కొత్త ఆధార్ నమోదు, నవీకరణ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా రెవెన్యు అనుబంధ సేవలు ఆదాయ, నివాస, కుల ధృవీకరణ, తదితర సేవలు అందించనున్నట్లు తెలిపారు. పిజిఆర్ఎస్ కి , కలక్టరేట్ కి వివిధ అర్జీలు పరిష్కారం కోసం వొచ్చే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *