
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలను మంగళవారం ఉదయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజల కోరిక ఏదీ అసంపూర్ణంగా మిగిలిపోకూడదని , ఏ కల నెరవేరకుండా ఆగిపోకూడదని, ఈ క్రిస్మస్ అందరికి అంతులేని ఆనందాన్ని ఇవ్వాలని, ప్రజల హృదయంలోని ప్రతి కల నెరవేరాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ క్రిస్మస్ నగర ప్రజలందరి జీవితంలో ప్రేమ, ఆనందం, సంతోషాన్ని ఇవ్వాలనీ, ప్రశాంతతను, మరపురాని జ్ఞాపకాలను అందించాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Tags vijayawada
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News