Breaking News

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు రెండు నెలల పొడిగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని రెండు నెలలు పాటు జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గానీ ఏది ముందు జరిగితే అప్పటివరకు పొడిగింపు ఉత్తర్వులు జారీచేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాన్షు శుక్లా, ఐఏఎస్, మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే జనవరి 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని ప్రకటనలో సంచాలకులు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *