హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి, అన్నక్యాంటీన్, సీఎంఆర్ఎఫ్కు హైదరాబాద్‌కు చెందిన కొడాలి అజయ్ ఘోష్ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు వచ్చిన సీఎం చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు ఎల్.వి.ఎస్.ఆర్కే ప్రసాద్‌తో కలిసి అమరావతి నిర్మాణానికి రూ.1 లక్ష, అన్న క్యాంటీన్ నిర్వహణకు రూ.1 లక్ష, సీఎం సహాయ నిధికి రూ.1 లక్ష చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు సంబంధిత చెక్కులను అజయ్ ఘోష్ సీఎంకు అందించారు. అజయ్ ఘోష్‌ను సీఎం చంద్రబాబు అభినందించారు.
Tags hydarabad
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News