Breaking News

సామాన్య ప్ర‌జ‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాము : ఎంపి కేశినేని శివ‌నాథ్

-8వ డివిజ‌న్ లో మూడు సిసి రోడ్ల నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న
-టీడీపీ హాయంలో నిరంతరాయంగా అభివృద్థి
-నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మాస్టార్‌ ప్లాన్‌
-రూ. 40 లక్షల అంచనా వ్యయంతో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని,ఎమ్మెల్యే గద్దె

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర వాసులకు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా సజావుగా రహదారులపై ప్రయాణించేలా ఆలోచ‌న‌ చేస్తున్నాము. విజయవాడ నగరంలోని ట్రాఫిక్‌ సమస్య పరిష్కరానికి ప్రత్యేకంగా మాస్ట‌ర్ ప్లాన్‌ సిద్ధం చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారని కేశినేని శివనాథ్‌ చెప్పారు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో 8వ డివిజన్ లోని జమ్మిచెట్టు సెంటర్‌ సమీపంలో ఉన్న కెనరా బ్యాంక్‌ రోడ్డుతో పాటుగా మరో రెండు రోడ్లకు సుమారు రూ.40 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబు హ‌యంలో అభివృద్థి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలల అవుతుందని, నిత్యం ఏదో ఒక డివిజన్‌లో అభివృద్థి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని చెప్పారు. రహదారుల నిర్మాణంతో పాటుగా ప్రజా సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నామ‌న్నారు. 2014–19 కాలంలో టీడీపీ హ‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరంలో 34 రోడ్లను నిర్మాణం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే తూర్పు నియోజకవర్గ పరిధిలో అనేక రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన‌ట్లు చెప్పారు.

నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చేయడానికి ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, మున్సిపల్‌ అధికారులతో ప్రజా ప్రతినిధులు కలిసి పర్యటనలు చేసి సమస్యను అధికారులకు పూర్తిగా వివరించి సాధ్యమైనంత త్వరగా సమస్య ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. నగర వాసులకు ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా సజావుగా రహదారులపై ప్రయాణించేలా చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలోని ట్రాఫిక్‌ సమస్య పరిష్కరానికి ప్రత్యేకంగా మాష్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారని కేశినేని శివనాథ్‌ చెప్పారు. ఇప్పటికే అధికారులతో ఈ అంశంపై సమావేశం నిర్వహించామన్నారు.

నగరంలోని డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి అంశాలపై వచ్చే పార్లమెంట్ స‌మావేశాల్లో ప్రస్తావించి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకుని వాటిని అభివృద్థి చేస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ఎంపీ కేశినేని శివనాథ్‌ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో విజయవాడ నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించి మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హ‌యంలోనే కొత్త రహదారులు, ప్లై ఓవర్ల నిర్మాణం జ‌రిగింద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్రతి రోజూ రూ.70 లక్షల నుంచి కోటి రూపాయలకు తగ్గకుండా అభివృద్థి పనులకు శంకుస్థాపనలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. నగరంలో ఉన్న రోడ్లను అభివృద్థి చేసుకుంటూనే కొత్తగా రహదారులు, ప్లైవోవర్లను నిర్మాణం చేసిన ఘనత ఒక్క సీఎం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు.

నగరంలోని ప్లైవోవర్లు అన్ని టీడీపీ హాయంలోనే నిర్మాణం చేశామన్నారు. వీటితో పాటుగా పంట కాలువ రోడ్డు, టవర్‌ లైన్‌ రోడ్డు నిర్మాణం చేశామని చెప్పారు. నగర అవుట్‌స్కర్ట్స్ ఏరియాలో రహదారుల అభివృద్థిపై దృష్టి పెట్టామన్నారు. బల్లెం వారి వీధి, మహానాడు రోడ్డు విస్తరణ చేసి నగరంలోని ఏ విధమైన ఇబ్బంది లేకుండా లారీలు రాకపోకలు సాగించేలా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించామన్నారు. ఆటోనగర్‌లోని కార్మికుల జీవనోపాధికి ఏవిధమైన ఇబ్బంది లేకుండా లారీలు రాకపోకలు సాగించేలా చూస్తామన్నారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి చర్చించుకుని నగరంలో కొత్తగా ప్లైవోవర్లు, రహదారుల నిర్మాణంపై చర్చించుకుని ముందుకు వెళుతున్నామన్నారు.

లారీలు ఇతర వాహనాల రాకపోకలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ను సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. వ్యాపారులు, ప్రజలు, విద్యార్థులు, ట్రాన్స్‌పోర్ట్‌ యజమానులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌ సజావుగా ఉండేలా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.

కార్పొరేటర్‌ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ డివిజన్‌లోని రహదారుల నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు. డివిజన్‌లోని మరిన్ని రోడ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించనున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమములో కార్పొరేట‌ర్లు ముమ్మ‌నేని ప్ర‌సాద్, 8వ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌ల్లెల రామ‌కృష్ణ, ఎస్సీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎస్సీ సెల్ జిల్లా కార్య‌ద‌ర్శి దోమ‌కొండ ర‌వి కుమార్ , 7వ డివిజ‌న్ పార్టీ అధ్య‌క్షుడు ప‌ట‌మ‌ట స‌తీష్ చంద్ర , స్థానిక నాయ‌కులు బద్దూరి వీరారెడ్డి , సుంక‌ర ముర‌ళీ కృష్ణ‌, గ‌ద్దె సురేష్ బాబు, న‌ర్రా రామ‌కృష్ణ‌, జి.ఎమ్. గిరిబాబు , నున్న కృష్ణ‌య్య‌, జ్యోతి నాగ‌రాజు, ఈఈ స్రామాజ్యం, డిఈ శాంత‌కుమార్, ఎఈ నాగేశ్వ‌ర‌రావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *