Breaking News

స్వయం ఉపాధి పథకం క్రింద నోటిఫికేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు బి.సి, ఇ.బి.సి., కమ్మ, రెడ్డి, వైశ్యా, క్షత్రియ బ్రాహ్మణ, & కాపు సామాజిక వర్గం వారి సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు అన్ని జిల్లాల బి.సి కార్పోరేషన్ల ద్వారా ప్రతిస్టాత్మకంగా అమలు చేయదలచిన స్వయం ఉపాధి పథకం క్రింద నోటిఫికేషన్ జారి చేసియున్నారు. సదరు నోటిఫికేషన్ ప్రకారం గుంటూరు జిల్లాలో రూ.29.97 కోట్ల సబ్సిడి, రూ.29.97 కోట్ల బ్యాంకు లోను మొత్తం రూ.59.94 కోట్ల విలువ గల స్వయం ఉపాది యూనిట్లు 2471 మందికి వారు ఎంచుకొన్న జివనోపాధి యూనిట్లు మంజూరు చేయుటకు వార్షిక లక్ష్యములు నిర్దేశించియున్నారు. పథకం క్రింద దరఖాస్తు చేసుకొటకు ఆశక్తి వున్న అభ్యర్థులు; మీ వయస్సు వయస్సు 21-60 సంవత్సరముల మద్యన వుండి, కులము సర్టిఫికేటు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు & బ్యాంకు ఖాతా కలిగి వున్నట్లైతే తేది:08.01.2025 నుండి తేది.16.01.2025 లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవలయును అని పత్రికా ముఖంగా తెలియజేయడమైనది. అదనపు సమాచారం కొరకు మీ మండల / మున్సిపాలిటీ కార్యాలయము వారిని సంప్రదించవలసినదిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *