అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 9, 10 తేదీల్లో ( రేపు, ఎల్లుండి) ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో జరుగుతున్న 18వ “ప్రవాస భారతీయ దివస్” కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతున్నారు. కేంద్ర విదేశీ వ్యవహార శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సమావేశంలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో పాల్గొనే నిమిత్తం మంత్రి శ్రీనివాస్ ఈరోజు రాత్రి విజయనగరం నుండి బయలుదేరి భువనేశ్వర్ వెళుతున్నారు. రేపు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే “ప్రవాస భారతీయ దివస్” కార్యక్రమం రెండు రోజులు పాటు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసించే భారతీయ మూలాలున్న వారందరినీ ఏకం చేయడం తోపాటు, ఆయా దేశాల్లో భారతీయ సంతతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి తగిన పరిష్కారం కనుగొనడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న ప్రవాస భారతీయ ప్రముఖులు పలువురు ఈ సమావేశాల్లో హాజరవుతారు. వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకెళ్లడం తోపాటు, భారతీయ సంతతిలో విదేశాలలో ఎక్కువగా నివసించే ప్రవాసాంధ్రులను ఏకతాటిపై తెచ్చేందుకు, ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి శ్రీనివాస్ తెలియజేశారు. ఇంతటి ప్రాముఖ్యత గల ప్రవాస భారతీయ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తనకు పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు.
Tags amaravathi
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News