విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం కృష్ణాజిల్లా మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నేషనల్ యూత్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రధానం చేసి స్వామి వివేకనంద యొక్క జీవిత విశేషాలను వారికి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ సుంకర రాము మాట్లాడుతూ వివేకానంద జీవితం చాలా చిన్న వయసులోనే ముగిసిందని కానీ అతను చేసిన ప్రసంగాలు అతను రాసిన పుస్తకాలు ఎప్పటికీ మనకు గుర్తున్నాయని మనల్ని ప్రభావితం చేస్తున్నాయని యువత అంతా ఆయన బాటలో నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె నరేంద్ర, ఎన్సిసి ఆఫీసర్ సుదర్శన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాబా విద్యార్థులు యువత పాల్గొన్నారు.