-ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపొందించాలి
-స్థానిక ప్రజా ప్రతినిధులు సమక్షంలో నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 18 నుంచి చేపట్టనున్న స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కార్యాచరణ ప్రణాళిక పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లాలో స్వచ్చఆంధ్ర స్వచ్ఛ్ దివస్ కార్యక్రమం అమలు పై మునిసిపల్ పంచాయతి అధికారులకి కలెక్టరు సూచనలను చెయ్యడం జరిగింది.
జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి నెలా ప్రతి మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్‌గా పాటించాలని నిర్ణయించిన్నట్లు తెలిపారు. థీమ్జి జనవరి, 2025 ‘‘కొత్త సంవత్సరం-క్లీన్ స్టార్ట్’’ ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ‘‘దైవభక్తి పక్కన పరిశుభ్రత’’ నినాదంతో ప్రతి ఒక్కరిని పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు చేసి బహిరంగంగా చెత్తవేసే అలవాటును అరికట్టడంతో పాటు సామూహిక క్లీనింగ్ డ్రైవ్‌ల ద్వారా చెత్త, చెదరం వంటివి తొలగింపు, పరిసరాల శుభ్రపరచడం శిధిలాల తొలగింపు, బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, మొదలైన వాటిలో మూసుకుపోయిన కాలువలను డ్రైయిన్లలో పూడిక తీత పనులు చేపట్టడం ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కమ్యూనిటీ మరియు పబ్లిక్ టాయిలెట్లను శానిటైజ్ చేయండి వంటి చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటిస్తానని ప్రతిజ్ఞ తీసుకుని ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. స్వచ్చఆంధ్ర స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర `స్వచ్ఛ దివస్‌లో భాగంగా గ్రామ, మండల పంచాయతీ స్థాయి అధికారులు తొలగించిన చెత్త రవాణాకు వాహనాలు అవసరమైన యంత్రాలు దాతల సహకారంతో సమకూర్చుకునేలా కృషి చేయాలన్నారు. అవసరమైతే మండలంలోని ఇతర గ్రామ పంచాయితీలకు చెందిన పారిశుధ్య సిబ్బందిని చెత్త కుప్పల తొలగింపు కోసం వినియోగించు కోవాలన్నారు. మిశ్రమ వ్యర్థాలు కలిగిన చెత్త నుండి ఆ ప్రదేశంలో తడి పొడి చెత్తను వేరు చేసి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యర్థ పదార్థాల తో రూపొందించిన ప్రాజెక్టు ప్రదర్శించాలని పేర్కొన్నారు. పారిశుధ్య పని ప్రారంభించే ముందు మరియు పని సమయంలోను చెత్తను తొలగించిన అనంతరం వివిధ కోణాలతో కూడి ఫోటోలు తీసి పిపిటి, డాక్యుమెంటరీ రూపొందించాలన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు , పాఠశాలలలో, స్కూల్స్ ప్రాంగణాలలో నిర్వహించి పచ్చదనం పరిశుభ్రతలో అధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి జిల్లా గ్రామ పంచాయితీ అధికారి ఎమ్. నాగలత, ఆర్ ఎమ్ సి డిప్యూటి కమీషనర్ ఎస్ వెంకట రమణ, ఆర్ ఎమ్ సి వైద్య అధికారి వి. వినూత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.