Breaking News

ఒకేషనల్ ట్రైనర్ నియామకం కోసం దళారులను నమ్మి మోసపోవద్దు

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సు అమలు కోసం బోధకులు (ఒకేషనల్ ట్రైనర్లు) నియామకాల్ని థర్డ్ పార్టీ ఏజెన్సీలు అయిన ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్ నిర్వహిస్తున్నారని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS.,  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని తెలిపారు.
ఈ పోస్టులకు పూర్తిగా ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్ నిర్వహణలో, పరిమిత కాలం మాత్రమే ఉంటాయని, సమగ్ర శిక్షాలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టులు కావని తెలిపారు. ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్స్ ఏజెన్సీలకు, ఒకేషనల్ ట్రైనర్లకు మధ్య ఒప్పందం ఉంటుంది. వృత్తి విద్యా కోర్సు బోధకులకు సమగ్ర శిక్షాతో ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగా, పారదర్శకతగా ఉండాలనే ఉద్దేశంతో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించాలని, అభ్యర్థుల నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయకూడదని ఒకేషనల్ ట్రైనింగ్ పార్టనర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని తెలిపారు. అభ్యర్థులు దళారుల ప్రలోభాలకు గురికావొద్దని, డబ్బులు ఇచ్చి మోసపోతే, సమగ్ర శిక్షాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *