పోర్టుల అభివృద్ధి – పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుదీర్ఘ తీర ప్రాంత కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి భవిష్యత్తులో పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీ.సీ జనార్థన్ రెడ్డి అన్నారు. నేడు మంగళగిరిలోని ఏపీ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో పోర్టుల అభివృద్ధి – పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సీ పోర్టుల పాత్ర కీలకమని.. కాబట్టి త్వరితగతిన వాటిని పూర్తి చేయాల్సిన ఆవశ్యకతపై మంత్రి అధికారులకు తెలియజేశారు.. ముఖ్యంగా (EPC)పద్ధతిలో చేపట్టిన 3 పోర్టుల ప్రగతిని సమీక్షించి త్వరితగతిన ఆయా పోర్టులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఫేజ్ 1 లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్ లు, అలాగే ఫేజ్ 2 లో తక్కువ ఖర్చుతో చేపట్టబోయే ఫిషింగ్ హార్బర్లు (LOW COST FISHING HARBOUR) – 5 పై ఈ సందర్భంగా సమీక్షించారు..

6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ల గురించి గతంలో ఒకే ప్యాకేజ్ కింద టెండర్లు పిలవడంతో ఎవరూ ముందుకు రాని పరిస్థితిపై అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటిని 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని మంత్రి అధికారులకు సూచించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో గోడౌన్ లు అద్దెకు ఇవ్వడం.. గోడౌన్ ల దీర్ఘకాలిక లీజులు, తాత్కాలిక లీజులపై కూడా మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. లీజులకు సంబంధించి అర్హత కలిగిన వారి లీజులను పొడిగింపు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, సి ఎఫ్ ఓ డోలా శంకర్, ఏపీ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ జీ.వి రాఘవరావు, కాకినాడ పోర్ట్ ఆఫీసర్ ధర్మశాస్త తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *