Breaking News

ఇకపై ఆట పాటలు పాఠ్యాంశాల్లో భాగం

– 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ ప్రారంభించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస రావు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటపాటలు కూడా పాఠ్యప్రణాళికలో భాగం చేస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాస రావు తెలిపారు. పటమట హైస్కూల్లో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ ప్రారంభించిన అనంతరం ఎస్పీడీ మాట్లాడారు.

క్రీడలను విద్యా ప్రణాళికలో భాగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.
“నేను క్రీడాభిమానిని, నేను సమగ్ర శిక్షా కార్యాలయం ఆవరణలోనే సిబ్బందితో షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాను. నాకు క్రీడాకారులు అంటే చాలా ఇష్టం. ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో మీరు ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా నన్ను సంప్రదించండి. నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటాను.” అని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన క్రీడాకారులకు భరోసా ఇచ్చారు.‌ వివిధ రాష్ట్రాలు క్రీడా పోటీల నిర్వహణకు టీఎస్ ఆర్ ఫండ్స్ దాతల సహకారం పై ఆధారపడుతుంటే.. ఏపీలో
క్రీడల నిర్వహణకు ప్రభుత్వంరూ. 7.5 కోట్ల నిధులు కేటాయించడం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలుస్తోందన్నారు. ఈ టోర్నమెంట్ క్రీడాకారుల్లో ప్రతిభను మెరుగుపరచడానికి ఉత్తమ వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు అందరూ ఈ క్రీడా పండుగను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొన్న 12 రాష్ట్రాల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాధికారి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు యు.వి. సుబ్బారావు,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ భానుమూర్తి, అధికారులు, కే బి సి స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అశోక్ నగర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *