-బాధిత మహిళలకు అండగా ఉంటాం..మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని ఉద్యోగులకు మంత్రి హితవు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉన్నత అధికారై ఉండి అసభ్య కార్యకలాపాలకు పాల్పడుతూ మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటంపై రవాణా శాఖ మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. ఈ రోజు వార్త పత్రికలలో సదరు అధికారి దుష్ప్రవర్తనపై వచ్చిన వార్త దురదృష్టకరమని తెలుపుతూ, మంత్రి ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై సదరు ఉన్నత అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించి కేంద్ర కార్యాలయానికీ సరెండర్ చేశామని, ఒక సీనియర్ అధికారి ద్వారా సమగ్ర విచారణ తక్షణమే చేపట్టి దీనికి కారకులైన ఉన్నత అధికారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని,
సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇటువంటి దుష్ప్రవర్తనను ఉపేక్షించేది లేదని తెలిపారు. బాధిత మహిళలకు అండగా నిలిచి భరోసా కల్పిస్తామని మంత్రి తెలిపారు.
మరియు రాష్ట్రంలో ఇటువంటి దుస్స ఘటనలు ఎక్కడ తలెత్తినా ప్రభుత్వం దృష్టికి తెలియపరచాలని తెలిపారు.
భవిష్యత్ లో మరో అధికారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటానికి తావు ఇవ్వకుండా చర్యలు ఉంటాయని, అధికార్లు రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని అధికారులకు మంత్రి ఆదేశిoచారు.
బాధితురాలిని ఫోన్ పరామర్శించిన మంత్రి
కడప జిల్లా రవాణా అధికారి నుండి లైంగిక వేధింపులకు గురైన మహిళా ఉద్యోగితో ఫోన్ లో మాట్లాడి పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కుటుంబ సభ్యలతో ఫోన్ లో మాట్లాడి అండగా ఉంటామని మంత్రి ధైర్యం చెప్పారు. ఇప్పటికే నిందితుడిని పై చర్య ఆదేశాలు ఇచ్చామని, శిక్ష పడేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దుష్ప్రవర్తనకు పాల్పడిన అధికారిపై చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని భరోసా కల్పించారు.
Prajavartha Online Telugu News