Breaking News

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 261 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువు లోపు పరిష్కారం చూపాలి : జిల్లా జాయింట్ కలెక్టర్
-శుభం బన్సల్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, (పి జి ఆర్ ఎస్ ) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపిడిఓ లు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీ జి ఆర్ ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలి అని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు డి ఆర్ ఓ నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్ర రెడ్డి, సుధారాణి, రోజ్ మాoడ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి, ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు.

శాఖల వారీగా అర్జీల వివరాలు : రెవెన్యూ -158, సర్వే అండ్ ల్యాండ్స్ – 6, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ -14, ఎండోమెంట్ – 4, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ – 2, పోలీస్ -12, గిరిజన సంక్షేమ శాఖ – 1, ఐసిడిఎస్ -6, స్కూల్ ఎడ్యుకేషన్ -8, ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ -2, పంచాయతీరాజ్ – 17, మెడికల్ ఎడ్యుకేషన్ – 1, సివిల్ సప్లై – 6, ఫిషరీస్ -2, ఏపీఎస్పీడీసీఎల్ -2, రూరల్ డెవలప్మెంట్ -1, పశుసంవర్ధక శాఖ – 2, సర్ఫ్- 3, ఆర్డబ్ల్యూఎస్ -5, మార్కెటింగ్-1, హౌసింగ్ -1, ఎక్సైజ్- 3, నేషనల్ హైవే – 1, టీటీడీ -1, ఎంప్లాయిమెంట్ -1 డ్రగ్ ఇన్స్పెక్షన్ -1 వెరసి మొత్తం 261 వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరు వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరయిన వివిధ శాఖలకు సంబందించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *